వివాదాలకు చెక్.. చంద్రబాబుతో సినీ పెద్దల భేటీకి ముహూర్తం ఖరారు! పవన్ ఆధ్వర్యంలోనే..
Thu Jun 12, 2025 11:30 Politics
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలు, వివాదాలకు త్వరలో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుతో సినీ పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తుల సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ భేటీతో ప్రస్తుతం నెలకొన్న అనేక అపరిష్కృత అంశాలకు ఒక ముగింపు లభిస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తున్నా, సినీ పరిశ్రమ పెద్దలతోగానీ, ప్రభుత్వ అధికారులతోగానీ ఇప్పటివరకు సరైన చర్చలు జరగలేదన్న అసంతృప్తి కొంతకాలంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నటుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలమైనా ముఖ్యమంత్రితో అధికారిక సమావేశం జరగకపోవడంపై ఆయన గట్టిగానే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 15వ తేదీన ఉండవల్లిలో చంద్రబాబును కలిసేందుకు అప్పాయింట్ మెంట్ కోరారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ మేరకు అప్పాయింట్ మెంట్ ఖరారైనట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ రాళ్ల దాడి.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం!
దాదాపు 30 మంది వరకు సినీ రంగ ప్రముఖులు ఏపీ సీఎంను కలవనున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్, దిల్ రాజు పరిశ్రమ నుంచి పెద్దలుగా తమ సమస్యలను చంద్రబాబుకు వివరించనున్నారు. త్వరలో జరగనున్న ఈ సమావేశం, సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష చర్చలకు వేదిక కానుంది. ఈ భేటీలో ప్రధానంగా సినిమా నిర్మాణం, ప్రదర్శనకు సంబంధించిన విధానాలు, పన్నుల అంశాలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల నియంత్రణ వంటి కీలక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా, ఇటీవల కొన్ని పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు, ప్రత్యేక ప్రదర్శనలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశాలపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు. చాలాకాలంగా టాలీవుడ్‌కు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఉన్న సత్సంబంధాలకు కొంతకాలంగా అడ్డంకిగా మారిన వివాదాలకు ఈ సమావేశంతో ఎండ్ కార్డ్ పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Tollywood #Bigwigs #Confirmed #Meeting #Pawankalyan #ViralNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.